2024 ఎన్నికల తర్వాత కేకే అనే పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. అలాగే హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే ఫలితాలు తప్పడంతో ఈ సర్వే పైన తీవ్రమైన విమర్శలు కూడా వినిపించాయి.. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై వేసిన అంచనా నిజమైంది.. అయితే హర్యానాతో పాటు ఆ తర్వాత జరిగి అన్ని ఎన్నికలలో కూడా బిజెపి గ్రాఫ్ తగ్గుతుందని ముందుగానే తెలియజేశారు.



మహారాష్ట్రలో కేకే సర్వే ఎలాంటి అంచనాలు ప్రకటిస్తుందా అని అందరూ ఎదురు చూడగా అనూహ్యంగా జాతీయస్థాయిలో సర్వే సంస్థ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహారాష్ట్రలో 225 స్థానాలలో మహాయుతి కూటమి గెలుస్తుందంటూ కేకే సర్వే తెలియజేశారు. దీంతో ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటి నుంచి మహాయుతి కూటమి అధికారాన్ని కనబరిచేలా కనిపిస్తున్నది. ఉదయం 11 గంటల వరకు అందించిన ప్రకారం మహాకూటమి 220 స్థానాలలో ఆధిపత్యం కనిపించింది. దీంతో ఒక్కసారిగా కేకే సర్వే పేరు మరొకసారి వినిపిస్తోంది.


చాలా జాతీయస్థాయిలో పేర్పొందిన సర్వేలు సైతం మహాయుతి కూటమి 180 నుంచి 190 స్థానాలు వస్తాయని చెప్పగా కేకే మాత్రం 225 స్థానాలు గెలుస్తుందని చెప్పారట. దీంతో ఒక్కసారిగా అటు కేకే సర్వే పైన మరొక సారి చర్చ మొదలయ్యిందట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎగ్జిట్ పోలీసులు వార్తలు లో నిలిచిన కేకే సర్వే కూటమి సర్వేకి 160 కి పైగా స్థానాలలో విజయం అందుకుంటుందని చెప్పడం జరిగింది. కేకే సర్వే అంచనాలు సైతం తగ్గట్టుగా ఫలితాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుత మహారాష్ట్ర ఫలితాలు చూస్తూ ఉంటే కేకే సర్వేకు చాలా దగ్గరగా ఉండడంతో జాతీయస్థాయిలో కూడా కేకే సర్వే పేరు మరొకసారి వినిపించడం ఖాయమని తెలుగు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: