ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడిప్పుడే కార్పొరేషన్ తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల ఎంపిక జరుగుతుంది. అయితే చంద్రబాబు ఆచితూచి పదవులు పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన - బిజెపికి చెందిన పార్టీలు ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశంతో పాటు జనసేన - బిజెపికి చెందిన చాలామంది నేతలు చాలా నియోజకవర్గాలలో సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితిలు వచ్చాయి. మూడు పార్టీలు ఒకటి కావడంతో పాటు మూడు పార్టీల ఓటు బ్యాంకు కలిసికట్టుగా ఒకటి కావడంతో కూటమి ఘనవిజయం సాధించింది. ఇప్పటికే రెండు విడతలు గా చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇచ్చిన పదవులు చూస్తే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు దేక్కాయి.
ఏపీసీ చైర్మన్గా భీమవరం నుంచి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును ఎంపిక చేశారు. ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి విజయం సాధించారు. ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు వెళ్లి ... జనసేన కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అదే కమిటీకి సభ్యుడుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎంపికయ్యారు. రాధాకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఇటీవల ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి వరించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వరించాయి. దీంతో శుక్రవారం వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. రఘురామ కృష్ణం రాజు తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకుంటే ఆయనకు చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ పదవి తో సరిపెట్టేశారు.