ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలందరూ గజగజ వణికి పోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే... తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే... ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ఎలాంటి డోకా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం... తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు, ఇతర సౌకర్యాలు అని అంటున్నారు.
జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అటు వయనాడు ఎన్నికల... కోసం తెలంగాణ హెలికాప్టర్లను వాడారు. తెలంగాణ నుంచి డబ్బులు కూడా వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో... రేవంత్ రెడ్డి ని దించేస్తే ఈ సదుపాయాలన్నీ.. మళ్లీ రావడం కష్టం. ఒకవేళ మహారాష్ట్రలో... కాంగ్రెస్ గెలిచి ఉంటే... వాళ్ల చేతిలో అతిపెద్ద రాష్ట్రం ఉండేది. అప్పుడు తెలంగాణ అవసరం ఉండేది కాదు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బిజెపి గెలిచింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అవసరం కాంగ్రెస్కు ఉంది. ఎప్పటిలాగే డబ్బులు.. సరఫరా చేసే.. దమ్ము కేవలం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందని.. కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట. ఆయనను దించేసి కొత్త ముఖ్యమంత్రిని చేస్తే... కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట. అలా చేస్తే రేవంత్ రెడ్డి బిజెపిలోకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారట. అంటే ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చాలా సేఫ్ గా ఉన్నట్లే చెబుతున్నారు.