పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తున్న సమయంలో మోదీ వెనుక ఒక మహిళా సిబ్బంది కనిపించారు. కంగనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను పంచుకోవడం జరిగింది. ఈ ఫోటోకు కంగనా రనౌత్ మాత్రం ఎలాంటి క్యాప్షన్ ను రాయలేదు. చాలామంది ఆ మహిళ ప్రధాని భద్రతా బృందమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలు అయి ఉండవచ్చని భావించారు. అయితే వైరల్ ఫోటో గురించి మోదీ భద్రతా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీ క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ లో కొంతమంది మహిళలు ఉన్నారని వెల్లడించాయి. అయితే వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ మాత్రం ఎస్పీజీ బృందంలో భాగమైన సభ్యురాలు కాదని తెలిపాయి. ఆమె ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పుకొచ్చాయి. ఆ మహిళ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఆ మహిళ పేరు కానీ ఇతర వివరాలు కానీ వెల్లడి కాలేదు. 1984 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో ప్రధానులు, వారి కుటుంబాల భద్రత కోసం ఎస్పీజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రధాని, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ భద్రతను కల్పించడం జరుగుతుంది. వైరల్ అవుతున్న మోదీ ఫోటో వెనుక అసలు కథ తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.