ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్నటువంటి అంశం ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది.. ఈ విషయం మీద ఇటీవలే  హైకోర్టు కీలకమైన ప్రశ్నలు వేయడం జరిగింది.. కేఏ పాల్  వేసిన పిటీషన్కు సైతం సమాధానాలు తెలియజేసింది ధర్మాసనం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్న అంశము కేంద్ర ప్రభుత్వానికి సంబంధమని హైకోర్టు తేల్చి చెప్పిందట. ఫలానా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలని తాము ఎలా సిఫార్సు చేయగలము అంటూ హైకోర్టు తెలియజేసిందట.


ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  హైకోర్టులో కోర్టులో వేసిన పిటిషన్ పైన ఇప్పుడు ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.. ఈ సందర్భంగా ఈ పిటిషన్ పైన వాదనలు వినిపిస్తూ పాల్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా హామి ఇవ్వడం జరిగిందని.. హోదా ఇస్తే ఎలాంటి పెట్టుబడులు వచ్చి ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయనే విషయాల పైన తెలిపారు.. ఇప్పటికే రాష్ట్రం లక్షల కోట్లలో అప్పులో ఉందని ఖజానా ఖాళీ అయిందని విషయాన్ని సీఎం కూడా ప్రకటనలు చేశారని తెలిపారు.. ఈ విషయం పైన కూడా తిరిగి పై కౌంటర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సైతం హైకోర్టు దాఖలు చేయలేదని తెలిపారు.


దీంతో రాష్ట్రం ప్రత్యేక హోదాను కోరుకుంటుందా కేంద్రం అందుకు సమూహంగా ఉందా లేదా అనే విషయాల పైన కౌంటర్ వేసేలా ఆదేశించాలని కేఏ పాల్ కోరారు..అయితే వీటి పైన హైకోర్టు మాత్రం.. ఇలాంటి వాటిలలో కౌంటర్ వేయాల లేదా అనేది ప్రభుత్వాల విధానం పైనే ఉంటుందని ఈ నేపథ్యంలోని ప్రత్యేక హోదా విషయంలో ఏదైనా రాతపూర్వకమైన హామీ ఉందా అంటూ కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సోలిసిటర్ జనరల్ స్పందిస్తూ ఎలాంటి రాతపూర్వకమైన హామీ లేదని పార్లమెంటులో మాత్రమే ప్రకటన ఉందని తెలిపారు.. అయితే ఏపీకే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏవి? ఇస్తే వచ్చే లాభాలు ఏవి? అనే విషయం పైన పిటిషన్ వేయాలని కేఏ పాల్ ను హైకోర్టు ఆదేశించింది.. దీంతో డిసెంబర్ 11 కి ఈ విషయం పైన వాయిదా వేశారు. వాస్తవానికి ప్రత్యేక హోదా అనే విషయం రాసి ఉంచారట.. కానీ అది నోటి మాట కాదని విభజన చట్టంలో ఉన్నదట.. దీన్ని బట్టి చూస్తే ఇది అబద్దమే చెబుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి..మరి ప్రత్యేక హోదా విషయం పైన అడు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి ఉన్న చిత్తశుద్ధి కచ్చితంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: