కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన ,బిజెపి పార్టీలో మూకుమ్మడిగా కలిసికట్టుకొని మరి పోటీ చేసి అధికారాన్ని అందుకున్నాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ,డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ కి వ్యవహరిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కూడా ఎలాంటి విషయాలలోనైనా సరే కలిసికట్టుగానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేతలు గొడవ పడినప్పటికీ కూటమి మాత్రం సజావుగానే ముందుకు వెళుతుందని ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా టిడిపి ఎమ్మెల్యే పైన పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


కాకినాడ పోర్టు నుంచి గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతూ ఉండడం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలను స్థానిక ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు పట్టించుకోవాలంటు ఎమ్మెల్యే పైన ఫైర్ అయ్యారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్నారని.. అందుకు సంబంధించి నౌకలోకి కూడా వెళ్లి మరి పవన్ కళ్యాణ్ చూడడం జరిగింది. పోర్టు నుంచి గత పాలనలో మొదలైన ఈ అక్రమ రవాణా ఇప్పటికి కొనసాగుతూనే ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సమాధానం ఎవరు చెబుతారు అంటూ పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగిందట.



మొత్తానికి పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఎవరినైన కూడా వదిలేది లేదనే ఎంతగా తెలియజేయడం జరిగింది. గతంలో కూడా చాలామంది నేతలు దురుసుగా మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ అందరిని హెచ్చరించడం జరిగింది. జనసేన నేతలనే కాకుండా ఇప్పుడు కూటమిలో ఎవరు ఎలాంటి తప్పు చేసినా సరే వారందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటారు డిప్యూటీ సీఎం పవన్.. ఇప్పుడు మనోహర్ నాదెండ్లతో కలిసి ఒక వీడియోని షేర్ చేయడంతో ఏపీ రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: