తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊహించని విధంగా ఒక వార్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెరగబోతున్నట్లు విద్యుత్ అధికారులు తెలియచేస్తున్నారు. వాస్తవానికి గడిచిన నెల రోజులుగా ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంలో కసరత్తులో ఉన్న సంగతి కూడా అందరికి విధితమే. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ERC ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ERC అవునుమతి తోనే ఉంటుందని తెలుస్తుంది.

ఈ క్రమంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ. 9412 కోట్ల అయిందన్న స్టార్ తో పాటు చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా యూనిట్ కు 92 పైసలు చొప్పున రేపటి నుంచి అనగా డిసెంబర్ నెల 1 నుంచి నవంబర్ 2026 వరకు కరెంటు చార్జీలు వసూలు అవుతాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే 94 కోట్ల వ్యవసాయ విద్యుత్ రాయితిని, 1500 కోట్లను ఏపీ ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 7912 కోట్ల రూపాయలు ఏపీ ప్రజలపై భారం పడబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ విషయంపై వైసీపీ పార్టీ నిరసన కూడా తెలుపుతుంది. అంతేకాకుండా మరోవైపు కూటమి ప్రభుత్వం వైసీపీ గతంలో చేసిన తప్పుదాల వల్లే ఇలా కరెంటు చార్జీలు పెంచవలసి వస్తుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇలా ఒక్కసారిగా ఏపీ ప్రజలకు భారంగా మారిందనే చెప్పాలి.


ఈ క్రమంలో  ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిఎస్‌పిడిసిఎల్‌) పరిధిలో యూనిట్‌కు 0.9132 పైసలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిసిపిడిసిఎల్‌) పరిధిలో 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్‌) పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయబోతున్నట్టు సమాచారం , ఇది ఇలా ఉండగా మరో వైపు ఆరు నెలల కాలంలో ప్రజల పైన వరుసగా రెండో సారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ భారం పడినట్టు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: