ఆంధ్రప్రదేశ్లోని మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి ఎదురవుతున్న ఇబ్బందులు రోజురోజుకీ కూడా అంతే పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మహిళల పైన బాలికల పైన కూడా చాలా అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.. నిన్నటి రోజున రాత్రి విశాఖపట్నంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది ఈ విషయం విన్న పలువురు ప్రజలతో పాటు సోషల్ మీడియా నేటిజన్స్ కూడా తిట్టిపోస్తున్నారు.


ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పైన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు సైతం గాయాలు కావడంతో వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రికి వెళ్లి మరి చికిత్స అందించారట.. అయితే సంఘటన విశాఖ ఐటిఐ జంక్షన్ వద్ద చోటు చేసుకున్నట్లు సమాచారం.ఈ యాసిడ్ కిటికీ  పక్కన కూర్చున్న ఒక మహిళ పైన పడటంతో ఆందోళన చెందడంతో వెంటనే డ్రైవర్ అలెర్ట్ అయి బస్సు ఆపి పోలీసులకు సమాచారాన్ని అందించారట.ఎక్కువగా బస్సు అద్దాల పైన పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది అంటూ అక్కడ ప్రయాణికులు తెలియజేశారు. ఇక బస్సులో ప్రయాణించిన ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని పలు ప్రజలు వాపోతున్నారు.


అయితే పోలీసులు సైతం సీసీ కెమెరా ఫుటేజ్ ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారట. యాసిడ్ దాడి మహిళల లక్ష్యంగా చేసుకొని చేశారా లేకపోతే ఏదైనా దర్యాప్తులో భాగంగా ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉన్నదట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల పైన చాలా దాడులు జరుగుతున్నాయని విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా నేటిజన్స్ కూడా మహిళలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతోంది అంటూ  సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు సైతం త్వరలోనే నిందితుని పట్టుకొని మరి శిక్షిస్తాం అంటూ తెలియజేశారు. మరి మహిళల పైన జరుగుతున్న విషయాలపై హోంమినిస్టర్ అనిత ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: