మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం తర్వాత బీజేపీ తనను పక్కకు నెట్టడం పట్ల మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కలత చెందారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుంది, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానాన్ని బీజేపీ తన హస్తగతం చేసుకోవాలనుకుంటోంది.

దీంతో షిండే తీవ్ర మనోవేదనకు గురయ్యారని శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని అందరికీ తెలియజేసేలా షిండే ఇటీవల సతారాలోని తన స్వస్థలమైన డేర్ గ్రామాన్ని సందర్శించారు. కూటమి ముఖ్య నేతల భేటీని కూడా ఆయన రద్దు చేశారు. ఆయన్ను బీజేపీ పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని, అందుకు ఆల్రెడీ కొత్త ప్లాన్లు అమలు చేశారని శివసేన పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో హోం శాఖపై పట్టు సాధించాలని శివసేన కూడా కోరుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చల సందర్భంగా ఈ డిమాండ్ లేవనెత్తినట్లు పిటిఐ నివేదించింది.

మరోవైపు తమకు ఎక్కువ సీట్లు రావడంతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలని బీజేపీ పట్టుబట్టడం శివసేనను కలవరపెట్టింది. శివసేన నేత సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. హోం శాఖ శివసేనకే దక్కాలని అన్నారు. సాధారణంగా హోం శాఖను ముఖ్యమంత్రికి కాకుండా ఉపముఖ్యమంత్రికి కేటాయిస్తారని వివరించారు. ఈ శాఖను బీజేపీ అదుపు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ శాఖను తీసుకుంటే ఇక మాకు మిగిలేది ఏంటి అన్నట్లు ఆయన మాట్లాడారు.

ప్రభుత్వానికి మద్దతు పొందడంలో ఏక్నాథ్ షిండే నాయకత్వం ఎలా ప్రధాన పాత్ర పోషించిందో కూడా సంజయ్ హైలైట్ చేసారు. మరాఠా కోటా సమస్యను పరిష్కరించడంలో షిండే కీలకపాత్ర పోషించారని, దీంతో ఆయనకు మంచి మద్దతు లభించిందని ఆయన సూచించారు. గతంలో మరచిపోయిన అనేక సంక్షేమ పథకాలను కూడా షిండే పునరుద్ధరించారు. ఏక్నాథ్ షిండే ఆందోళనలు చేసినప్పటికీ, తదుపరి ముఖ్యమంత్రి విషయంలో బిజెపి నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తానని, అడ్డంకి కాదన్నారు. ప్రస్తుతం, పదవీ విరమణ చేసిన ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ హోం శాఖను నిర్వహిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటుపై మంతనాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: