- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు ఆయ‌న పెద్ద కుమారుడు మంచు విష్ణు రాజ‌కీయంగా వైపీపీ తో క‌లిసి జ‌ర్నీ చేశారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు మోహ‌న్‌బాబు, విష్ణు ఇద్ద‌రూ క‌లిసి వైపీపీ కండువా క‌ప్పుకున్నారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపు కోసం ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌ట్టించుకోలేదు. బీజేపీకి ద‌గ్గ‌రగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని కూడా క‌లిసి వ‌చ్చారు. ఇక 2024 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ క‌నీసం త‌న కాలేజ్ ఫీజు రీ యింబ‌ర్స్ మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో మోహ‌న్‌బాబు తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు.


ఇక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చిత్తు గా ఓడిపోవ‌డం.. ఎంత స‌పోర్ట్ చేసినా సినీ రంగానికి జ‌గ‌న్ చేసిందేమి లేక‌పోవ‌డంతో చాలా మంది సినిమా వాళ్లు జ‌గ‌న్ కు దూరం అవుతున్నారు. పోసాని , ఆలీ తో పాటు శ్రీ రెడ్డి లాంటి వాళ్లు కూడా దండాలు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మంచు ఫ్యామిలీ కూడా జ‌గ‌న్ కు పూర్తిగా దూర‌మైన ప‌రిస్థితి. పైగా మంచు ఫ్యామిలీకి.. జ‌గ‌న్ ఫ్యామిలీకి బంధుత్వం కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే ఇప్పుడు మ‌ళ్లీ మంచు ఫ్యామిలీ టీడీపీకి బాగా క్లోజ్ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.


తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సినీ నటుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించారు. తనతో సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్ తో పలు అంశాలపై చర్చలు జ‌రిపామ‌ని.. అవి స‌క్సెస్ అయ్యాయ‌ని వెల్ల‌డించారు. లోకేష్ మంచి వ్య‌క్తి అని.. లోకేష్ కు భ‌గ‌వంతుడు మరింత శ‌క్తిని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని.. హర హర మహాదేవ అంటూ ట్వీట్‌ను విష్ణు ముగించారు. అయితే లోకేష్ తో తాను ఏయే విష‌యాలు చ‌ర్చించానో అన్న విష‌యాల‌ను అన్న‌ది విష్ణు చెప్ప‌లేదు.. అలాగే  ఏపీ సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో మంచు విష్ణు మంత్రి లోకేశ్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp