మోసానికి.. నమ్మకద్రోహానికి మధ్య తేడా ఏంటో తెలిస్తే, ఎప్పటికీ ఆనందంగా ఉండవచ్చు..!దీని అర్థం ఏమిటంటే..,మోసం అనేది అందరూ చేస్తారు.. కానీ నమ్మకద్రోహం అనేది కేవలం నువ్వు నమ్మిన వాళ్లు మాత్రమే చేస్తారు.. అయితే ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాను గమనించినట్లయితే, ఇక ఎప్పటికీ వీటికి దూరంగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడే నీ జీవితంలో సుఖసంతోషాలకు కొలువు ఏర్పడుతుంది. అని దీని వివరణ..ఒకవేళ నమ్మినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసుకు మించిన మంచి మిత్రుడు ఇంకెక్కడా లేడు అని గుర్తుపెట్టుకోవాలి..