అన్ని విషయాలను విధికే వదిలివేయడం మూర్ఖత్వం..! దీని వివరణ ఏమిటంటే.. ఏమి కావాలన్నా మనం ప్రయత్నించకుండా ఏదీ జరగదు. కానీ అన్ని విషయాలను విధికే వదిలేయడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.. తలరాతను కూడా మార్చే శక్తి మనుషులకు వుంది. అలాంటప్పుడు ప్రయత్నించి, ఓడిపోయినా ఫర్వాలేదు కానీ, ప్రయత్నించకుండా ఉంటేనే చాలా నేరం.. కాబట్టి ఏ విషయాన్ని అయినా ముందుగా మనం కల్పించుకుని, ఆ విషయం కోసమే అవగాహన చేయాలి. లేదు విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ ను సాధించలేరు అని దీని అర్థం.