మంచితనం మరీ ఎక్కువయితే మనవాళ్ళు శత్రువులు అవుతారు అనగా మంచితనం అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి. అలా కాదని ప్రతిదానికి సర్దుకుపోయి, మనవాళ్లే కదా అని చిన్న పెద్ద సహాయం చేస్తూ పోతే, చివరకు వారే శత్రువులు గా మారుతారు. ఎప్పుడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంచితనం మరీ ఎక్కువైనా కష్టమే లేదా మరీ తక్కువైనా కష్టమే.. అందుకే మంచితనాన్ని ఎప్పటికప్పుడు సమతుల్యం చేసుకుంటూ పోవాలి. మన వాళ్ళు అయినా బయట వాళ్ళు అయినా మంచి చేస్తే మంచి అని చెప్పాలి లేదా చెడు చేస్తే చెడు అని మాత్రమే చెప్పాలి.