మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది..దీని వివరణ ఏమిటంటే.. ప్రతి నిమిషం, ప్రతిక్షణం ఇతరుల పట్ల గాని, మన పట్ల గాని ఆలోచించే తీరు స్వచ్ఛంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ పైన ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరూ మన వాళ్లే అని అనుకోవాలి. అలా ఎప్పుడైతే అనుకొని, పూర్తిగా మన ఆలోచనలను మంచి మార్గం వైపు నడిపిస్తామో, అప్పుడు ప్రతి క్షణం ఆనందాల హరివిల్లు గా మారుతుంది. కష్టం కూడా మన ఒంట్లో నిలవలేక పారిపోతుంది. ఆనందానికి పుట్టిల్లు ఏర్పడుతుంది. కాబట్టి మన ఆలోచన తీరు మారినప్పుడే మనం జీవితాంతం ఆనందంగా ఉండగలము.