ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు.. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త..!ఉదాహరణకు మనం ఒంటరిగా ఉన్నప్పుడు సామాన్యంగా మంచి ఆలోచనలు రావనే చెప్పవచ్చు.. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా మన స్వార్థం కోసం, మనమే, మన కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఇతరుల కోసం ఆలోచించడం మానేస్తాము. మన మనసు ఏది చెబుతుందో, మన మెదడు కూడా అదే వినడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇక నలుగురిలో ఉన్నప్పుడు కూడా మన మాటలు జాగ్రత్తగా ఉంటే,ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు..