ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం..! దీని అర్థం ఏమిటంటే..మనం చనిపోయినప్పుడు మన వెంట ఏదీ రాదు. ఆ నలుగురు, మనం చేసిన మంచి మాత్రమే మనం వెంట వస్తుంది. ప్రతి ఒక్కరు చేతనైనంత సాయం చేస్తూ, మంచిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. జీవించేది కొద్ది కాలం అయినా సరే గొప్పగా జీవించటానికి ప్రయత్నం చేయాలి.. అప్పుడే మన జీవితానికి ఒక సార్ధకత ఉంటుంది..