మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది..! దీని అర్థం ఏమిటంటే.. ఓర్పు అనేది కొంత వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ మితిమీరిన ఓర్పు గనుక ఉంటే అది పిరికితనం అవుతుంది. ఎవరైతే ఎక్కువ ఓపికతో ఉంటారో, ఈ లోకం వారిని సహనశీలి అని సంబోధించకపోగా పిరికివారి కింద లెక్క కడుతుంది. కాబట్టి సహనానికి కూడా కొంచెం హద్దు అనేది ఉంటుంది. ఏదీ ఏమైనా సహనం ఎదుటివారికి పిరికితనం లాగా కనిపించకూడదు. ఒకవేళ అతి ఓర్పు ఎదుటివారికి పిరికితనం గా కనిపిస్తుంది .. అని దీని అర్థం.