ప్రయత్నం మానేస్తే మరణించినట్టే.. ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే..! దీని అర్థం ఏమిటంటే.. ఏదైనా ఒక విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలాంటి ప్రయత్నం లో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అదరకుండా, బెదరకుండా ఆ ప్రయత్నం సఫలం అయ్యేవరకు కష్టపడాలి. ఒకవేళ కష్టం ఎదురైందని మధ్యలోనే ఆపేస్తే మరణించిన వారితో సమానం. అయితే అదే విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ మరణించినా అది విజయం సాధించినట్టు.. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఉండే కన్నా ప్రయత్నం చేసి మరణించడం ఎంతో ఉత్తమమైన పని..