ఎందుకు ఏకాదశికి ఇంత ప్రాధాన్యం ఉంది అంటే..? ఏకాదశి అనగానే 11 లక్షణాలు కలిగిన టువంటిది. అలాగే 11 పెత్తనాలు కలిగినటువంటిది అని అర్థం. ఏమిటా పదకొండు అంటే అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు. వీటిని నడిపించేటటువంటి మనసు. జ్ఞానేంద్రియాలు అంటే అందరికీ తెలిసినవే కన్ను, ముక్కు, చెవి, నోరు అలాగే చర్మం. ఇక కర్మేంద్రియాలు అంటే కాళ్లు,చేతులు,విసర్జక అవయవాలు,శరీరావయవాలు ఇవి. అయితే వీటన్నింటినీ అదుపులో ఉంచేది మాత్రం మనసు మాత్రమే. అయితే ఈ పదకొండు ఒకే ముఖంగా ఉండి, ఏకోన్ముఖంగా ఉండి పని చేయడానికి అనుకూలంగా ఉండే రోజునే మనం ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అలాగే మనసు కూడా నిర్ధిష్టంగా ఉంటాయి. అందుకే ఏకాదశి కి అందరూ అంత ప్రాధాన్యతను ఇస్తారు.