చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది.. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది..! దీని అర్థం ఏమిటంటే సాధారణంగా చదువు అనేది మనం చదువుకునేటప్పుడు, పాఠం విన్న తర్వాత మాత్రమే పరీక్ష పెట్టడం జరుగుతుంది. కానీ జీవితం అలా కాదు, జీవితం పరీక్ష పెట్టిన తర్వాతనే మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. అంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతనే మనకు జీవితం ఏంటో తెలిసి వస్తుంది. అప్పుడే అందరితో ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఇక ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము అని దీని అర్థం..