రావణుడు శ్రీరాముడితో చెప్పుకుంటూ..ఎన్నో శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా.. నీ ముందు యుద్ధంలో ఓడిపోయాను.. దీనికి కారణం ఒక్కటే.. నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు.. నా తమ్ముడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు.. నీ కుటుంబ పరివారం నీతో ఉంది. కాబట్టి నువ్వు విజయాన్ని సాధించగలిగావు. నా అన్న వారు నాతో ఒక్కరు కూడా లేకపోవడం వల్ల నేను పరాజయం పాలయ్యాను .కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన, యుద్ధమైనా విజయం సాధిస్తుంది. అదే పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంట ఉంటుంది.. ఎప్పుడైతే కుటుంబం దూరం అవుతుందో అప్పుడు బతుకే భారమవుతుంది.. అంటూ రావణుడు చెప్పుకొచ్చాడు.