ఓపిక చాలా విలువైనది.. ఎంత ఓపికగా ఉంటామో.. జీవితంలో అంత సాధించవచ్చు..దీని అర్థం ఏమిటంటే.. జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రధానమైనది.. మనం ఎంత ఓర్పుగా ఉంటామో అంతే స్థాయిలో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.. కోపం అప్పటికప్పుడే పనికి వస్తుంది. కోపం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా బుద్ధిని కోల్పోయి బుద్ధి హీనులు అవుతారు.. కాబట్టి కోపాన్ని విడనాడి ఓపికను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.. ఎప్పుడైతే ఓపికగా ఉంటామో అప్పుడు స్వర్గాన్ని జయించిన వారమవుతాము..