బయట అడ్డమైన గడ్డి తినడం మానేశారు. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్క వారికి రోగాలు రాకూడదని భగవంతుడిని కోరుకోవడం వంటి అలవాట్లను నేర్చుకున్నారు. భారతీయ సాంప్రదాయ పద్ధతులను గుర్తుతెచ్చుకొని మరీ పాటించడం మొదలు పెట్టారు. ఇక వ్యక్తిగత శుభ్రత మీద పరిసరాల పరిశుభ్రత మీద అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. ఇక డబ్బు ఎంత ఉన్నా అవసరమైనప్పుడు మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, పనిమనిషి కూడా అవసరం లేదు అన్నట్టుగా మారిపోయారు.. చూశారు కదా కరోనా వచ్చిన తర్వాత ఇన్ని మంచి పనులు జరిగాయి..