మనల్ని అందరూ ప్రేమించాలంటే.. మొదట మనం అందరినీ ప్రేమించాలి..!చేస్తున్న పనిపట్ల శ్రద్ధ వహిస్తే ,అందరి ప్రశంశలు పొందడమే కాకుండా ఫలితం కూడా బాగుంటుంది. లభించిన వృత్తిని పరమ పవిత్రంగా భావించి ఆనందంగా , నిజాయితీతో పని చేయాలి. మన ఆలోచనలు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులలోనూ అదుపు తప్పకుండా, మంచి ఆలోచనలతోనే మనిషి ఆదర్శ ప్రియుడు అవుతాడు.అందరి ప్రేమానురాగాలు పొందడానికి వీలవుతుంది..