అప్పుడే పెళ్లయిన తన కొడుకుతో ప్రతి తల్లి తన కోడలిని బాగా చూసుకోవాలి అని చెప్పాలి. తల్లి తన కొడుకుతో ..నీ భార్యను ఎప్పుడూ తల్లితో పోల్చవద్దు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అదే నీ భార్యకు నీ లాగే ఇది కూడా ఒక కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో, తన తల్లిదండ్రులు కూడా అలాగే పెంచి ఉంటారు కదా..! తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా,మంచి తల్లిగా బాధ్యతలను నెరవేరుస్తుంది.