పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఉండేవి. ప్రస్తుతం మన ఇళ్లల్లోనే మరుగుదొడ్లు ఉంటున్నాయి. వీటినుంచి సూక్ష్మక్రిములు నేరుగా మనం తినే ఆహారంలో చేరడం వల్ల అనారోగ్య పాలవుతున్న విషయం తెలిసిందే. చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్లు, చేతులు, ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి రమ్మనే వారు. ప్రతి గడపకు పసుపు కూడా రాయమని చెప్పేవారు. వారానికి ఒకసారి ఇంట్లో వున్న సామానులన్నీ సర్ధి, ఇల్లంతా శుభ్రం చేసే వాళ్ళు. ఇక సున్నంతో గోడలకు రంగు వేయడమే కాకుండా ముగ్గులు కూడా పెట్టేవారు. ఇందుకు కారణం కాల్షియం నుండి వెలువడే ధాతువులు ఇల్లు అంతా వ్యాపించి, కొన్ని వ్యాధి కారక వైరస్ ను నిరోధిస్తాయి.