మన జీవితం ఎప్పుడూ ఆనందంగా సుఖసంతోషాలతో సాగాలి అంటే, అందుకు తగ్గట్టుగా కొన్ని కొన్ని అలవాట్లను మానుకోవాలి. లేదంటే అవి మరీ అతిగా మారి వ్యసనంగా తయారయ్యి మిమ్మల్ని దహించి వేస్తాయి. ఇక ఆ మంటల్లో కాలి బూడిద అవ్వకముందే అది మంట అని గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం నేర్చుకోండి. జీవితంలో కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకుంటే గెలుపెప్పుడూ మీ వెంటే ఉంటుంది.ఇల్లు, తిండి ,సౌకర్యాలు మొదలగు ఫ్రీగా వచ్చే వాటిని చులకనగా చూడవద్దు. ఇక ఎవరిని అంత తొందర గా ఫాలో అవ్వకండి. అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పొరపాట్లు చేసిన వారే.ఎవరో ఒకరు నచ్చారు అని చెప్పి వారిని ఫాలో అవ్వడం అంత మంచిది కాదు. బ్రాండెడ్ బట్టలు కావాలని వున్న డబ్బును వృధా చేయవద్దు.మీ జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేసే లాగా ఉండకూడదు. మీరు ఏది చేసినా, ఏమి చేయాలనుకున్నా నిర్ణయం మీదే ఉండాలి.