జీవితంలో ఎవరైనా ఏదైనా సాదించాలి అనుకునేటప్పుడు ముందుగా చిన్నచిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక ఆ అడుగులకు బలం ఎక్కువ అయినప్పుడు పరుగు మొదలవుతుంది. ఒకవేళ నువ్వు వేసే అడుగు సరిగా లేకపోతే, ఆ పరుగు కష్టమవుతుంది.. కానీ ఎందులోనైనా ముందుకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే, తప్పకుండా మీరు కష్టపడతారు. అందులో దాగి ఉన్న అర్థాలను, మెలకువలను నేర్చుకుంటారు. అయినా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి, మిమ్మల్ని అడుగులు వేయనీకుండా మీ దారిని అడ్డుకుంటే, కొత్త దారిలోకి వెళ్లాలని డిసైడ్ అవ్వడం నేర్చుకోవాలి. ఇక మీరు కూడా ఏదైనా సమస్య వచ్చిందని డీలా పడిపోతే, జీవితంలో ఏది సాధించలేరు. కాబట్టి కష్టమైనా నష్టమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే దేన్నైనా సాధించగలరు..