పైశాచిక ప్రభావం కల వారికి దూరంగా ఉండాలి.వీరు అవతలివాళ్ళు మంచిగా వుంటే తట్టుకోలేరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ అవతలివారు చెడుని కోరుకుంటారు కాబట్టి వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇతరుల ప్రవర్తన బాగా లేదని తెలిసినప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అవతలివాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని, అది మీకు హానికరం అని అనిపించినప్పుడు వెంటనే వారికి దూరంగా ఉండాలి. లేదంటే అబద్దాలు చెప్పే వారు, మీకెన్ని చెప్పిన మరో అబద్ధం చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.. జీవితంలో ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండగలిగితే మనం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాము..