దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ప్రస్తుత కాలంలో పక్కవాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎదుటివాడు ఏమైనా పర్లేదు , నేను బాగుంటే చాలు అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జీవించడం ఉత్తమం. అందుకే కొంచెం చెడు గా అనిపించినా , అలాంటి వారికి దూరంగా ఉంటూ మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి..