నీవు ఇతరులకు సాయం చేస్తే , దేవుడు నీకు సాయం చేస్తాడు. ప్రస్తుతం కరోనా సమయంలో కూడా చాలామంది సహాయం కూడా అందలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అందరికీ దూరంగా ఉండమని చెప్తున్నారే కానీ సహాయం చేయవద్దని మాత్రం చెప్పడం లేదు. అందుకే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మీకు తోచిన సహాయం చేయడం వల్ల భగవంతుడు మీకు ఎప్పుడూ కష్టాల్లో తోడుగా ఉంటాడు. అందుకే వీలైనంత వరకూ ఇతరులకు మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయడానికి పాటుపడండి.