సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు, తనలోని కుడి భాగాన్ని పురుషుడిగా గాను, తనలోని ఎడమ భాగాన్ని స్త్రీ గా తీసుకొని , ఆడ మగలను సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచాడు. ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా ఎడమ భాగంలోనే పార్వతీ దేవిని ఉంచారు. కాబట్టి ఆయనను అర్ధనారీశ్వరుడు అని అంటారు. కాబట్టి భర్త కు ఎడమవైపున భార్య ఉండాలి.