బొటనవేలు కంటే పక్కవేలు పొడవుగా ఉంటే దానిని గ్రీకు ఫుట్ అని పిలుస్తారు. ఇలాంటి పాదాలు కలిగి ఉన్న వాళ్లు చాలా కళాత్మకంగా ఉండడంతోపాటు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారట. అంతే కాదు ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను మోటివేట్ చేస్తూ ఉంటారట. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరికి దూకుడెక్కువ. కాబట్టి ఆచితూచి ముందడుగు వేస్తే జీవితంలో సత్ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కావలసిన సహాయాన్ని కూడా అందిస్తారు అట.