కౌరవుల మీద పగ తీర్చుకునేందుకు శకుని తండ్రి సుబల..నీవు నేను చనిపోయిన తర్వాత..నా ఎముకలలోనే పగ అంతా ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచికలు తయారు చేసి, నీవు మనసులో ఏమి అనుకొని వేస్తే ,అదే జరుగుతుంది. నీకు జూదం లో మంచి పట్టు ఉంది కాబట్టి,జూదం ఆడి కౌరవుల సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని "ప్రమాణం చేయించుకుంటాడు సుభల.శకుని తన తెలివితేటలకు తగ్గట్టుగా అందరిని తన మాట వినేటట్టు చేసుకొని, పాండవులతో జూదం ఆడమని పాండవుల మీదకు కౌరవులను ఉసిగొల్పుతాడు. పాండవులకు ఎలాగో శ్రీకృష్ణుడు అండగా ఉంటాడు కాబట్టి కౌరవుల నాశనం తప్పక జరుగుతుంది అని పాండవులకు, కౌరవులకు మధ్య మహాభారత యుద్ధాన్ని జరిగేలా చేసి , కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు.