అశ్వినీ దేవతలు పురాణ పురుషులు అలాగే కవలలు. వీరు సూర్యునికి సంజ్ఞాదేవీ (ఛాయ దేవి) కి పుట్టిన వారు.సూర్యుడు - సంజ్ఞాదేవీ ఇద్దరూ అశ్వరూపంలో సంభోగంలో ఉండగా అశ్వినీ పుత్రులు జన్మించారు.ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొంది, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందడానికి , వారు లోకాలను తిరగసాగాడు. ఇక తరువాత సూర్యుడు ,సంజ్ఞాదేవీ నీ ఓదార్చి అక్కనుండి తీసుకెళ్ళిపోయాడు. ఇక అశ్వినీ పుత్రులను ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి.