నేటి మంచిమాట.. ఏం చేయలన్నా ఇప్పుడే ప్రయత్నించండి.. వాయిదా వేయొద్దు! అవును చాలామంది అంతే.. ఈరోజు పనిని ఈరోజు పూర్తి చెయ్యరు.. ఎవరైనా పని పూర్తి చెయ్యి అని చెప్పారు అంటే? చేస్తాలే రేపు అంటూ వాయిదా వేస్తారు.. రేపు ఎం అవుతుంది.. రేపటి పని చెయ్యలేరు.. ఈరోజు పని రేపు పూర్తి చేసిన ఉపయోగం ఉండదు.
అందుకే ఎప్పుడు పని అప్పుడే పూర్తి చెయ్యాలి.. కాదు అంటే మీకు మంచి గుర్తింపు కాదు కదా! మీకు ఉన్న గుర్తింపు కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసి వాయిదాలు లేకుండా ముందు చూపుతో జీవించండి. అప్పుడే మీ జీవితంలో టెన్సన్స్ లేకుండా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది...
వాయిదాలు జీవితాలను నాశనం చేస్తాయి.. పిల్లలు రేపు చదువుదాంలే అని వాయిదా వేస్తే టీచర్ ఆరోజే పరీక్షా పెట్టచ్చు.. బాస్ ఇచ్చిన పని రేపు పూర్తి చేద్దాంలే అని అనుకుంటే ఆ వర్క్ తో ఆరోజే పని ఉండచ్చు.. అందుకే వాయిదాలు వేస్తే మంచిది కాదు.. ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకోండి.