నేటి మంచిమాట.. ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే! అవును.. మనకు ఏం తెలియాలి అన్న కూడా మనకు చదువు ఉండాలి. అవును కొందరు అంటుంటారు.. చదువుది ఏముంది లోకజ్ఞానం ఉండాలి అని. ఒప్పుంటం.. లోకజ్ఞానం ఉండాలి.. కానీ చదువు లేకుండా లోకజ్ఞానం ఉన్న ఉపయోగం లేదు.
కాస్త అయినా చదువు ఉండాలి కదా! ఈ కాలంలో వ్యవసాయం చెయ్యాలి అన్న కూడా కాస్త అయినా చదువుకోవాలి. నువ్వు చదువుకుంటే నీ మాటలను నలుగురు వింటారు. నీకు చదువు లేకుంటే నీకు ఏ చదువు లేదు ఇంకా నువ్వు మాకు ఏం చెప్తావు అంటూ కామెంట్లు చేస్తారు. అందుకే మనం చదువుకోవాలి.. నలుగురికి చదువు గురించి బోధించాలి.
చదువు అనేది ఎంతటి వాడినైనా మనిషిని చేస్తుంది. చదువు ఉంటే.. చదువుని ఆయుధాన్ని చేసుకొని ఏదైనా సాధించవచ్చు. చదువు అంటే 10వ తరగతి.. ఇంటర్, డిగ్రీ మాత్రమే కాదు.. ప్రతిదీ చదువే.. ఒక పని రావాలి అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.. వినాలి.. ఆచరించాలి అప్పుడే ఆ పని చెయ్యగలరు.
ఒక ఉద్యోగం చెయ్యాలి అన్న ఆ తర్వాత ఆ చదువుకు తగ్గ కోర్స్ చెయ్యాలి. పూర్తిగా నేర్చుకోవాలి.. దానిలో పరిపూర్ణత సాధించాలి అప్పుడే విజయం సాదిస్తావు. నువ్వు ఎం చెయ్యాలి అనుకున్న నీకు చదువు ఉండాలి.. అప్పుడే ఈ ప్రపంచాన్ని మార్చగల్గుతావు.. చదువు + లోకజ్ఞానం ఉన్న వాడిని ఎవరు ఎదురించలేరు.. ఎవరు చేరుకోలేరు. అందుకే మన పెద్దలు అంటుంటారు.. ఇష్టం లేని చదువు కష్టం.. చదువులేని జీవితం నష్టం అని. ఈ సామెతను గుర్తు పెట్టుకొని అయినా మీరు మీ పిల్లలను గొప్పగా చదివించండి.