ప్రెస్ నోట్లు చూస్తే.. భలే నవ్వు వస్తుంది. తాజాగా వచ్చిన ఓ ప్రెస్ నోట్ కూడా అంతే. అందులో ఏం ఉందో తెలుసా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారట. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారట. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ చెప్పారట.