మంత్రి మల్లారెడ్డి ఓ భూవ్యవహారంలో ఫోన్లో నేరుగా బెదిరించిన విషయం ఆడియోల ద్వారా లీక్ కాలేదా.. ఇంత జరిగినా సరే.. అలాంటిదేమీ జరగలేదు.. మీకు గుర్తున్నా సరే దాన్ని మీరు మర్చిపోండి.. ఎందుకంటే.. అబ్బే మా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒక్క భూకబ్జా ఆరోపణ కూడా రాలేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లోనే తేల్చిపారేశారు.