ఎన్నికలు అంటే ఎన్నో అంశాలు పని చేస్తాయి.. కులం, బలం, స్థానిక రాజకీయాలు.. ఇలా ఎన్నో అంశాలు కలసిరావాలి. అయితే వీటికితోడు సానుభూతి కూడా ఓ బలమైన ఫ్యాక్టర్ అన్నది కాదనలేని వాస్తవం. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితం అయ్యింది కూడా. ఇప్పుడు హూజూరాబాద్లోనూ ఇదే తరహా సానుభూతి రాజకీయం నడుస్తోందా అనిపిస్తోంది.