కేసీఆర్ విశ్వరూపం చూపించారు. దళిత బంధు రాజకీయ లబ్ది కోసం తెస్తున్నామంటున్నారు.. ఔను.. నిజమే.. రాజకీయ లబ్ది కోసం తెస్తే తప్పేంటి.. కష్టపడే వాడు ఫలితం కోరుకోవద్దా.. టీఆర్ఎస్కు రాజకీయ లబ్ది రావొద్దా.. మాది కూడా రాజకీయ పార్టీయే కదా.. టీఆర్ఎస్ ఏమైనా సన్నాసుల మఠమా.. రాజకీయ లబ్ది కోరుకుంటే తప్పేంటి.. అంటూ పది నిమిషాల క్రితం తాను చెప్పిన దానికి భిన్నంగా పూర్తిగా ప్లేటు ఫిరాయించేశారు.