ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తాజాగా చేసిన ఓ వీడియోలో సీఎం జగన్ తీరును.. ఆయన ప్రవేశ పెట్టిన నగదు పంపిణీ పథకాలను తీవ్రంగా విమర్శించారు. అసలు ఇలా నగదు బదిలీ చేసేందుకు సీఎం అవసరమా.. ఓ అకౌంటెంట్ ఉంటే చాలు కదా అంటూ సెటైర్ వేశారు. ఇలా ప్రభుత్వం తన ఆదాయాన్నంతా పంచుకుంటూ వెళ్లాలని నిర్ణయిస్తే.. ఇందుకు ఓ అకౌంటెంట్ సరిపోతాడని.. ఆ పని అతడు ఇంకా చక్కగా చేస్తాడని అన్నారు.