అంతకుముందు.. ఎంత మంది స్నేహితుల నెంబర్లయినా నోటికి వచ్చేవి.. కనీసం ఓ 10 నెంబర్లయినా ఠక్కున చెప్పగలిగే వాళ్లం.. కానీ ఇప్పుడు.. మన నెంబర్ తప్ప కనీసం ఇంట్లో వాళ్ల నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోవడం లేదు.. గుర్తు పెట్టుకోలేక కాదు.. ఆ అవసరం లేక.. మరి అవసరం లేదని ఉపయోగించడం మానేస్తే.. రేపు అవసరం వచ్చినప్పుడు మన మెదడు ఉపయోగపడుతుందా..