మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకూ భారత్ తరపున అత్యంత ప్రతిభ చూపించింది మాత్రం అమ్మాయిలే. ఆడపిల్ల అంటే చిన్నచూపు చూసే మన దేశంలో ఇప్పుడు అమ్మాయిలే బంగారం అని మరోసారి రుజువు చేశారు. స్త్రీని దేవతగా పూజిస్తేనో.. కాళ్లకింద నలిపేసే మగమహానుభావులున్న దేశం మనది. అలాంటి వారికి కనువిప్పు మన ఒలింపిక్ బంగారాలు.. ఆడాళ్లూ మీకు మరోసారి జోహార్లు..