మేమింతే.. ఒలింపిక్స్లో ఓ పతకం వస్తే చాలు.. పూనకంతో ఊగిపోతాం.. అది కాస్త స్వర్ణం అయితే ఇక మా ఆనందానికి అంతుండదు.. మా ఛానళ్లకు పూనకం వస్తుంది.. మా పత్రికలకు కవిత్వం వస్తుంది.. మా నేతలకు దాతృత్వం తన్నుకొస్తుంది.. వార్తాఛానళ్లలో బ్రేకింగుల మీద బ్రేకింగులు.. ఆ హడావిడి అంతా ఇంతాకాదు..