ఏపీలో జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను వేటాడుతోంది. ఏ చిన్న కేసు దొరికినా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు వరుసగా అనేక మంది జైలు పాలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చారనుకోండి.. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేశ్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని స్వయంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. మరి ఈ ఆగస్టు నారా లోకేశ్ అరెస్టుకు అవకాశం ఇస్తుందా.. అన్నది చూడాలి.