పెట్రో ధరల పెంపుపై లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం విషయంలో ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. ఈ సమాధానం ఇచ్చింది జూలైలో.. కానీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. అంటే ఇప్పటి వరకూ దాన్ని ఎవరూ పెద్దగా చూడనట్టుంది. ఈ అంశాన్ని నిన్న మీడియా బాగా హైలెట్ చేసింది. దీంతో.. సాయంత్రానికి మరో ప్రకటన విడుదల చేసింది కేంద్రం. పెట్రోలు, డీజిల్పై ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నుల విషయంలో విశాఖ పేరును ఉదాహరణగా తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది.