ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికా దేశాల నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుంటున్నారని తెలుగుదేశం నేత పట్టాభి అంటున్నారు. పార్టీ నేతలతో కలిసి ఆయన పోర్టును సందర్శించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. కాకినాడలో ఇటీవల తగలబడిన బోటులో మాదకద్రవ్యాలు ఉన్నాయంటూ పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి.