సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం.. రెండు సినిమాలు ఆ హీరోల కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అవడం తెలిసిందే. అయితే ఆ హీరోల కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ అన్నంతవరకు బాగానే ఉండగా నాన్ బాహుబలి రికార్డులు మావంటే మావే అన్నట్టుగా చెప్పుకోవడమే అపహాస్యంగా ఉంది. సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఈ సినిమాల వసూళ్ల గురించి పెద్ద కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఒకరు 100 కోట్లంటే మరొకరు 150 కోట్లు.. వాళ్లు 200 కోట్లంటే మరో సినిమా వాళ్లు 220 కోట్లంటూ పోస్టర్స్ వేస్తూ వచ్చారు.

 

రిలీజ్ టైం లో రెండు సినిమాలు ఒకే డేట్ లాక్ చేసి నిర్మాతలను, బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్స్ ను టెన్షన్ పెట్టగా రిలీజ్ తర్వాత ఈ పోస్టర్స్ గొడవతో మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. రెండు సినిమాలను ప్రేక్షకులను మెప్పించాయి.. ఇండస్ట్రీ బాగుంటుంది అన్న యాంగిల్ మర్చిపోయి ఎవరికి వారు మాది సూపర్ హిట్ అంటే మాది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. లేటెస్ట్ గా నాన్ బాహుబలి రికార్డులు మావే అంటూ ఒక సినిమా పోస్టర్ రాగా.. మరో సినిమా వాళ్లు కూడా నాన్ బాహుబలి రికార్డులు కేవలం తెలుగు రాష్ట్రాల్లో అంటూ మరో పోస్టర్ వదిలారు.

 

ఏదో ఆ స్టార్స్ కు అసలు హిట్టు సినిమాలే పడనట్టు.. ఈ ఒక్క సినిమాతోనే అద్భుతాలు సృష్టించాలి అన్నట్టు కాకపోతే ఈ కలక్షన్స్, పోస్టర్స్ గొడవ చాలా చీప్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. కేవలం హీరోల ఇమేజ్ కాపాడేందుకు నిర్మాతలు వేసే ఫిగర్స్ లా అనిపిస్తున్న ఈ వసూళ్లు అసలు నిజమైనవా కాదా అన్న డౌట్ కూడా వస్తుంది. హీరోలు తమ పట్టు వీడి మాది సూపర్ హిట్ అవతల వారిది మాకన్నా సెన్సేషనల్ హిట్ అని ఒప్పుకున్న రోజే ఇలాంటి గొడవలకు ఫుల్ స్టాప్ పడుతుందీ. అప్పటివరకు పోస్టర్స్ మధ్య నడిచే ఈ స్టార్ వార్.. అభిమానుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: