జే.వీ .సోమయాజులు మహబూబ్ నగర్ లో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజుల్లోనే శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాకు దర్శకుడు యోగి రూపొందించిన రాధాకృష్ణ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఇక శంకరాభరణం సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక దీని తరువాత ఏకంగా 150 సినిమాలలో రకరకాల పాత్రలు పోషించి, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.